సద్గురు: నేను ‘ప్రాణాయామం’ అంటే, మీరు దానిని ఇంగ్లీషులోకి తర్జుమా చేసి, అదేదో శ్వాసకు సంబంధించిన సాధన లేక ప్రక్రియ అనుకోవచ్చు. అది అలాంటిది కాదు. “ప్రాణం” అంటే ప్రాణశక్తి, “యమ” అంటే దానిమీద పట్టు సాధించడం. అదో సున్నితమైన ప్రక్రియ. దాని ద్వారా వ్యక్తి అంతర్గత శక్తులను తన స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చు. ఈ ప్రక్రియలు చాలా నిశితంగా, లోతుగా, ఎందుకు నేర్పుతారు అంటే, మన మన:ప్రాణాలను సమతుల్యం చేయటానికి, ఈ అంతర్గత శక్తులను పరిణామం చేయటం ఎంతో ముఖ్యం.

ఈ ప్రాణశక్తి పై ఆ వ్యక్తి యొక్క కర్మసంబంధమైన వాసనలు లిఖించ బడివుంటాయి. అందువల్ల అది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది.

మీరు ‘మీ జీవితంలో ఏమి చేస్తారు అన్నది, మీ శరీరం, మనసు, ఇంకా పూర్తి వ్యవస్థ ఎలా పనిచేస్తుంది’ అనే విషయాలను ఈ ప్రాణశక్తే నిర్ధారిస్తుంది. ఈ ప్రాణశక్తి ఎంతో తెలివైన శక్తి. ఎందువల్లనంటే, దానిపై ఆ వ్యక్తి యొక్క కర్మసంబంధమైన వాసనలు లిఖించ బడివుంటాయి. అందువల్ల అది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. అలాకాక, మనం నిత్యం ఉపయోగించే విద్యుత్ శక్తికి, ఈ విధమైన జ్ఞాపకం కానీ, తెలివి కానీ ఉండవు. అది ఇది ఒక బల్బులు వెలిగించవచ్చు, ఒక కెమెరాని నడిపించవచ్చు, అలాగే అనేక పనులు చేయొచ్చు. దానికి కారణం విద్యుత్ శక్తికి ఉన్న తెలివితేటల వల్ల కాదు. ఆ విద్యుత్ శక్తి నడిపే సాధనాలలోని తేడాల వల్ల. ముందు ముందు తెలివైన విద్యుత్ శక్తి కూడా వస్తుందేమో? మన ఈ ప్రాణశక్తి మీద ఒక విధమైన జ్ఞాపకం ముద్రిస్తే, దానిని ఒక ప్రత్యేక విధానాల్లో నడిచేలా మీరు చేయవచ్చు.

ఐదు రకాల ప్రాణాలు

శరీరంలో ఈ ప్రాణం ఐదు రూపాలలో వ్యక్తమవుతోంది. వాటిని పంచ వాయువులు అంటారు. ఈ ఐదు వాయువులు ప్రాణవాయువు, సమాన వాయువు, ఉదాన వాయువు, అపాన వాయువు ఇంకా వ్యాన వాయువు. ఇవి మానవ యాంత్రిక వ్యవస్థలో వివిధ అంశాలను నడిపిస్తాయి. మనం శక్తి చలన క్రియ వంటి యోగసాధన ద్వారా ఈ పంచ వాయువుల మీద పట్టు సాధించవచ్చు. మీరు ఈ పంచ వాయువుల మీద సాధికారత సాధిస్తే, అన్ని రకాల వ్యాధుల నుంచి, ముఖ్యంగా మానసికమైన వ్యాధుల నుంచి మీరు విముక్తి పొందుతారు. ప్రస్తుతం ప్రపంచానికి కావలసింది అదే.

ఇప్పుడే మనం అది చేయకపోతే, ఇప్పటి మన జీవన శైలిలో ఉన్న అనేక అవకతవకలవల్ల, వచ్చే 50 ఏళ్లలో ప్రపంచంలో మానసిక సమతుల్యత లేనివారు, మానసికంగా దెబ్బ తిన్నవారు, మానసిక అస్తవ్యస్తలకు లోనైనవారు, ఎన్నో రెట్లు పెరుగుతారు. మనం జీవితంలోని అనేక అంశాలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నాము. ముందు ముందు దానికి మనం ఎంతో మూల్యం చెల్లించవలసి వస్తుంది. మీ ప్రాణం మీద, మీరు పట్టు సాధిస్తే మీ బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మీరు మానసికంగా సమతుల్యతతో ఉంటారు. ప్రస్తుతం, బహుశా వాటిని గుర్తించకపోయినా, ఎంతో మంది మానసికంగా సమతుల్యత లేకుండానే ఉన్నారు.

ప్రాణాయామం వల్ల ప్రయోజనాలు

ఉదాహరణకు మీ చెయ్యి దానికిష్టమైనట్లుగా ప్రవర్తిస్తే, మీ కంట్లో పొడవటం, గీరడం, కొట్టడం చేస్తుంటే - అది ఒక రకమైన వ్యాధి. ప్రస్తుతం అనేక మంది బుర్రలు అదే చేస్తున్నాయి. ప్రతిరోజు అవి లోపల నుంచి పొడుస్తున్నాయి. వారు అరుపులు, కేకలు పెట్టేటట్లు చేస్తున్నాయి. అలాగే అనేక విధాలుగా బాధిస్తూ వారికి వ్యధను కలిగిస్తున్నాయి. సామాజికంగా వాటిని ఇంకా పట్టించుకోక పోయినా, అది ఒక రకమైన వ్యాధి. మనిషి దినదినం పడే బాధలు మానసిక సృష్టే. ఈ వ్యాధి మనలో ప్రవేశించింది మనం ప్రస్తుతం ఉన్న సామాజిక వ్యవస్థ వల్ల, చుట్టూ ఉన్న సాంకేతికతల వల్ల, ఇంకా అనేక రకమైన కారణాలవల్ల, ముందు ముందు ఈ వ్యాధి ప్రబలి పోతుంది.

శక్తి చలన క్రియ వంటి యోగసాధన ద్వారా మీరు ఈ పంచ వాయువుల మీద పట్టు సాధించవచ్చు.

ఎవరైతే తమ ప్రాణశక్తి పై పూర్తి పట్టు ఉంటుందో, వారికి నూటికి నూరు శాతం మానసిక సమతుల్యత వస్తుంది. దానివల్ల అనేక శారీరక రుగ్మతలను కూడా నివారించవచ్చు. అయినా కొన్ని రుగ్మతుల ఇన్ఫెక్షన్లు, మనం ప్రతినిత్యం ఎదుర్కొంటున్న అనేక రకాల రసాయనాలు, విషాలు లాంటి కొన్ని ప్రమాదాలు ఉంటాయి. మనము గాలి, నీరు, ఆహారం, వంటి వాటి పట్ల ఎంత జాగ్రత్త పడ్డా, మనకు వాటిపై పూర్తి నియంత్రణ అసాధ్యం. మరి ఇవి వ్యక్తి మీద ఎంత ప్రభావం చూపుతాయి అనేది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది.

బాహ్య కారణాల వల్ల మనం శారీరక ఆరోగ్యానికి నూటికి నూరు శాతం మనం భద్రత ఇవ్వలేము. కానీ మనం ఈ ప్రాణశక్తి మీద సాధికారత తీసుకుంటే, మానసిక శ్రేయస్సును మనం పూర్తిగా, ఖచ్చితంగా సాధించవచ్చు. మానసికంగా మీరు మంచి స్థితిలో ఉంటే, కొన్ని శారీరక సమస్యలు అంత బాధ పెట్టలేవు. అనేకసార్లు చిన్న చిన్న శారీరక సమస్యల కన్నా, వాటివల్ల మనసులో వచ్చే ప్రతిక్రియలు పెద్ద సమస్యలు అవుతాయి. ఈ ప్రాణ శక్తులు మీలో ఎలా పని చేస్తాయి, మిగతా సృష్టితో అవి ఎలా ప్రవర్తిస్తాయి, అవి పుట్టిన శిశువులో ఎలా ప్రవేశిస్తాయి, అలాగే చనిపోయిన వారి నుంచి ఎలా నిష్క్రమిస్తాయి, ఇలా ఈ విషయాలన్నీ గమనిస్తే, వాటికి తమదైన తెలివి ఉందని తెలుస్తుంది.

శక్తి చలన క్రియ - మీ ప్రాణ శక్తుల మీద సాధన చేయటం

ఈ పంచ ప్రాణాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవటానికి కొంత శ్రద్ధ, ఎరుక అవసరం. శక్తి చలన క్రియ ఎంతో విశిష్టమైన, గొప్ప ప్రక్రియ. కానీ మీరు చాలా శ్రద్ధగా చేయాలి. ఒక 40 నుంచి 60 నిమిషాల పాటు మీరు దానిపై శ్రద్ధ పెట్టవలసి వస్తుంది. ఎక్కువ మంది ఒక్క పూర్తి శ్వాస పైన కూడా తమ మనసును లగ్నం చేయలేకపోతున్నారు. మధ్యలోనే వారి ఆలోచనలు దారి తప్పుతాయి, లేక వారికి లెక్క దారి తప్పటం జరుగుతుంది. అలాకాక, మీ సాధన మొత్తం శ్వాస మీద మీ దృష్టిని ఏకాగ్రంగా ఉంచటానికి ఎన్నో నెలల లేక సంవత్సరాల కృషి అవసరం అవుతుంది.

అందుకే మనం శక్తి చలన క్రియను ఎప్పుడు శూన్య ధ్యానంతో కలిపి ఒక జతగా అందిస్తాము. మీరు కళ్లు మూసుకుంటే, మీ అనుభూతిలో ప్రపంచం లేకుండా చేసే స్థితికి శూన్య ధ్యానం మిమ్మల్ని తీసుకువెళుతుంది. మీరు ఈ ఆశీర్వాదాన్ని ఎప్పుడో ఒకప్పుడైనా సంపాదించాలి. మిమ్మల్ని మీరు అలా చేసుకుంటేనే, మీకు ఏదో ఒక దానిపై ఏకాగ్రత చూపగలరు. బలవంతంగా దృష్టి పెట్టడం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు.

ఏకాగ్రతతో ఉండడమే అసలు విషయం

శూన్య ఇంకా ఇతర సాధన దీని గురించే. మీరు ఎంత ముందుకు వెళ్తారు అనేది వేరే ప్రశ్న, ముఖ్యంగా ఈ నాటి ప్రపంచంలో. ఈనాడు మీ చుట్టూ ఏమి జరుగుతూ ఉన్నదో, దానికి నేనేమి వ్యతిరేకిని కాను. కానీ, దురదృష్టవశాత్తు ఈనాడు ఏదో పిచ్చిపిచ్చిగా ఉండటం అనేది ఫ్యాషన్ అయిపోయింది. గొప్పగా ఉండటం కాదు. అటువంటి దృక్పథంతో ‘మీ జీవం మీలో ఎలా పని చేస్తుందో’ అనే దానిపై దృష్టి పెట్టడం వీలు కాదు. అంటే అది ఎవరికి సాధ్యం కాదా? అంటే అలా అని కాదు, సాధ్యమే, మీరు దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు అనే దానిమీదే అది ఆధారపడి ఉంటుంది, మీరు దానికి అతి ముఖ్యమైన ప్రాముఖ్యతనిస్తూ ఉంటే, ప్రతిదీ తనంత తానుగా సమీకరించుకుంటూ ఉంటుంది.

మీలో ఉన్న జీవమే అసలైనది - మిగతావన్నీ కేవలం ఆరోపించబడినవే(Projections). కానీ మన దృష్టి ప్రస్తుతం వీటి మీదే ఉంది. అంతేకాని అసలైన దాని మీద లేదు.

మీ ప్రాధాన్యతలు అనేక దిక్కుల్లో ఉంటే, ఈ జీవితం యొక్క మౌలిక స్థాయిలో చూసినప్పుడు మీరు అనేక దారుల్లో పోతూ, ఎక్కడకూ చేరలేకపోతారు. సాంఘికంగా, సామాజికంగా మీరు ఏదో స్థితికి చేరవచ్చుగాని, భౌతిక స్థాయిలో మాత్రం మీ శరీరం సరాసరి స్మశానానికే చేరుతోంది. మహా అయితే మీరు మీ ప్రయాణాన్ని ఇంకాస్త పొడిగించుకోవచ్చు. మీ మనసుకు సంబంధించినంత వరకు అది గింగరాలు తిరుగుతూ ఉంటుంది. మీరు కేవలం మీ దృష్టిని జీవిత మౌలికతత్వం మీద పెడితేనే మీరు ఓ స్థాయికి చేరగలుగుతారు. మీలో ఉన్న ప్రాణమే అసలైనది - మిగతావన్నీ కేవలం ఆరోపించబడినవే. కానీ మన దృష్టి ప్రస్తుతం వీటి మీదే ఉంది. అంతేకాని అసలైన దాని మీద లేదు.

శక్తి చలన క్రియతో, మార్పు మెల్లగా జరుగుతుంది. మీ ప్రాణం మీద, వ్యవస్థలోని ఇతర ప్రక్రియల మీద మీరు పట్టు సాధించడం అనేది చాలా గొప్ప స్థితి. శక్తి చలన క్రియ ఆ స్థాయిలో పని చేస్తుంది. మీరు దానిని సాధన చేస్తే, మీరు మీ వ్యవస్థ మూలాలను బలపరచు కుంటున్నట్లు.

శాంభవీ మహాముద్ర – ప్రాణ శక్తికి అతీతంగా

శాంభవి మహాముద్రలోని ముఖ్యమైన అంశం ఏమిటంటే, ప్రాణానికి ఆవల ఉన్న సృష్టి మూలాన్ని తాకటానికి ఒక సాధనం.

శాంభవీ మహాముద్ర ఈ మొత్తం ఉనికికి మూలమైన దానిని స్పృశించే సంభావ్యతను మీకు ఇస్తుంది. కానీ మీరు దానిని అలా ప్రయత్నంతో చేయలేరు. మీరు చేయగలిగింది కేవలం దానికి కావాల్సిన వాతావరణాన్ని సృష్టించడమే. మనం ఎప్పుడూ శాంభవిని ‘స్త్రీ’ గా పరిగణిస్తాము. అందువల్లనే ఆమె మీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే మీరు భక్తి కనపరచాలి. మీరు సృష్టి మూలంతో స్పర్శలోకి రావచ్చు, అంతేగాని దానితో మీరు ఏమీ చేయలేరు. శాంభవి మహాముద్రలో కూడా కొంత ప్రాణాయామం ఉన్నది అది కూడా అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది.

శాంభవి మహాముద్రలోని ముఖ్యమైన అంశం ఏమిటంటే, ప్రాణానికి ఆవల ఉన్న సృష్టి మూలాన్ని తాగటానికి ఒక సాధనం. ఇది మీకు మొదటిరోజే జరగవచ్చు, లేక ఆరు నెలల పాటు చేసిన మీకేమి జరగకపోవచ్చు. కానీ, మీరు సాధన చేస్తూ ఉంటే ఆ కోణాన్నితాకే రోజు వస్తుంది. మీరు దానిని తాకితే, ఒక్కసారిగా అంతా మారిపోతుంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు