రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్: నమస్కారం సద్గురు. యవ్వనంలో మనుషులకి రకరకాల లక్ష్యాలు, గమ్యాలు, ఆశయాలు, విజయాలు ఉంటాయి. అందరూ ఇతరులు నిర్వచించిన విజయాల వెనుక పరుగెడుతారు. అతి సంబంధాలు కలిగిన, సమాచారంతో నిండిపోయిన ఈ యుగంలో, పనికి సంబంధించిన ఒత్తిడి, విపరీత సమాచార ఒత్తిడి కలుగుతున్నాయ్. ఇలాంటి ఒత్తిడి మన యువత సంతోషాన్ని పోగొడుతోంది. ఒత్తిడి ఎక్కువగా యువతకే కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యువత నిరంతరం సంతోషంగా ఎలా ఉండాలి. యవ్వనంలో ఉండే సంతోషం గురించిన సత్యం తెలియజేయండి.

సద్గురు:నమస్కారం రాజ్ గారూ....! ప్రతి తరంలోనూ, అన్నిటి గురించీ ఫిర్యాదు చేసే కొంతమంది ఉంటారు. అంతే కాకుండా, పరిస్థితుల్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునే వారు కూడా ఉంటారు. 

ఇప్పటి తరంలో మనకి ఎన్నో సౌలభ్యాలూ, సౌకర్యాలూ ఉన్నాయ్. ప్రస్తుతానికి ఇంకా ప్రపంచపు వేగం ఏమీ మారలేదు, కొన్ని వేల ఏళ్ళ క్రితం ఏ వేగం ఉందో అదే వేగమే ఇంకా ఉంది, కానీ ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల మన దూరాలు దగ్గరైనట్టు అనిపిస్తున్నాయ్ అంతే!

జీవితాన్ని సుఖంగానూ, సౌకర్యవంతంగానూ చేసిన ఈ సాంకేతికత మీద జనాలు పిర్యాదు చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, దీనికి తగ్గట్టుగా వారు తమ జీవితాలను సిద్ధం చేసుకోలేదు.

అతి సమాచారం గురించి ఫిర్యాదు చేసేవారు ఒకసారి ఊహించుకుని చూడాలి, ఒక వెయ్యేళ్ళ క్రితం మనకి ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఏం జరుగుతోందో మనకి తెలిసేది కాదు. ఏదైనా విపత్తు వచ్చినా లేదా కాస్త దూరంలో ఏదైనా గొప్ప విషయం జరిగినా ఒక నెలా రెండు నెలల దాకా ఏం తెలిసేది కాదు. ఇవాళ ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా వెంటనే తెలిసిపోతోంది.

సాంకేతికంగా మనం మునుపెన్నడూ లేనంతగా ఎదిగాం. ఈ తరానికి ఇది ఒక అధ్బుతమైన సౌకర్యం. జీవితాన్ని సుఖంగానూ, సౌకర్యవంతంగానూ చేసిన ఈ సాంకేతికత మీద జనాలు పిర్యాదు చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, దీనికి తగ్గట్టుగా వారు తమ జీవితాలను సిద్ధం చేసుకోలేదు. 

మీ సామర్ధ్యాలను పెంచుకోవాలి

ఒక్కసారి ఊహించుకుని చూడండి, ఒక వెయ్యేళ్ళ క్రితం మీరు ఇక్కడ జీవించి ఉంటే ఎలా ఉండేదని. మీరు పొద్దున్న లేవగానే మీకు కాలకృత్యాలకి నీరు కావాలి, మీరు దగ్గర్లో నదికెళ్ళి ఒక రెండు బకెట్ల నీళ్ళు తెచ్చుకోవాలి. నిజం చెప్తున్నా నమ్మండి, ఇప్పటి యువత కనీసం రెండు నీళ్ళ బకెట్లను ఒక మైలు మోసేంత బలంగా కూడా లేరు. దానికి తగినంత శరీర ధారుడ్యం లేదు వాళ్లకి.

మీ అస్తిత్వం యొక్క అంతర్గతాన్నిఅభివృద్ధి చేస్తూ, దానికి అవసరమైనంత సమయం వెచ్చిస్తే పరిస్థితుల నిర్వహణ సులువు అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా, మీకు ఈ తరంలో దొరికిన ఈ గొప్ప అవకాశాల గురించి మీరు ఫిర్యాదు చెయ్యడం మానేస్తారు.

ఒక వెయ్యి సంవత్సరాల క్రితం సాంకేతికత లేని సమయంలో రెండు బకెట్ల నీటిని ఎటువంటి పిర్యాదు లేకుండా మీరు మోస్తారా? మీరు కచ్చితంగా ఫిర్యాదు చేస్తారు, ఎందుకంటే మీకు కావలిసిన శారీరక శక్తి లేదు. అలాగే మిమ్మల్ని మీరు ఇప్పటి పరిస్థితులకి తగ్గట్టు మానసికంగా దృఢ పరుచుకోకపోతే, మీరు పిర్యాదే చేస్తారు.

మిమ్మల్ని మీరు ఈ జీవితానికి పూర్తిగా సన్నద్ధం చేసుకోవాలి. మీకు ముఖ్యమైన విషయాలు - మీ లక్ష్యాలు కాదు, తీరాల్సిన కోరికలు కాదు, మీరు కోరుకునే జీవన విధానాలు కాదు. మీరు ఆలోచించాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే ఈ జీవితం యొక్క నాణ్యతను పెంచి దాని అవకాశాలు అనంతం చెయ్యడమే. మీ అస్తిత్వం యొక్క అంతర్గతాన్నిఅభివృద్ధి చేస్తూ, దానికి అవసరమైనంత సమయం వెచ్చిస్తే పరిస్థితుల నిర్వహణ సులువు అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా, మీకు ఈ తరంలో దొరికిన ఈ గొప్ప అవకాశాల గురించి మీరు ఫిర్యాదు చెయ్యడం మానేస్తారు.

ఇదివరకు ఎప్పుడూ మీరు భారతదేశం నుంచి అమెరికాకి పధ్నాలుగు గంటల్లో వెళ్లలేకపోయేవారు, మీ ఫోన్లో ప్రపంచంలో ఎక్కడో ఉన్నవ్యక్తితో మాట్లాడలేకపోయేవారు, ముందు ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరుగుతోందో, నిజానికి అంతరిక్షంలో కూడా ఏం జరుగుతోందో చూడలేకపోయేవారు. ఇప్పుడు, మీరు మీ దృష్టికి అతీతంగా చూడగలరు, చెవులకు అతీతంగా వినగలరు, ఇంకా మీ సాధారణ అనుభవాలని మించిపోయే అనుభవాలను పొందగలరు.

మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోండి

మీ చుట్టూ ఉన్న సాంకేతికత కేవలం కొన్నినెలలు లేదా సంవత్సరాల్లోనే అద్భుతంగా అభివృద్ది ఆవుతోంది. ఇక మిమ్మల్ని మీరు అబివృద్ది చేసుకొనే సమయమిది. ఇన్నర్ ఇంజనీరింగ్ లేదా యోగా అంటే, ఈ జీవితాన్ని మెరుగుపరచటం పై దృష్టి పెట్టడమే. ఇది చెయ్యకుండా మీ జీవితంలో కార్యకలాపాలు పెంచితే, ఆ పనుల్ని సమర్ధంగా చెయ్యలేరు. ఇది ఎలా ఉంటుందంటే ఒక పాత పాడైన కారుని తీసుకుని ఒక F1 ట్రాక్ పైకి ఎక్కితే అది ఎలా ముక్కలౌతుందే, అటువంటిదే. అదే మనుషులకి కుడా జరుగుతోంది.

మన పిల్లలని ఉద్యోగం, డబ్బు సంపాదించడమనే కోణంలో చదువులు చెప్పించకుండా, వాళ్లని వాళ్ళే మెరుగుపరుచుకొనే విధంగా చదివించాలి. ఈ పరివర్తనకు కావాల్సిన సాధనాలు మనకి ఈ కాలంలో అత్యంత అవసరం, ఎందుకంటే బయటి విషయాలు మూడొంతులు యంత్రాలే నిర్వహిస్తున్నాయి. ఆ యంత్రాలకన్నా మీరు కొంచెం ఎక్కువ తెలివిగా తయారవటం ఎంతో అవసరం. 

సంపాదకుడి సూచన:మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి..UnplugWithSadhguru.org.