సెక్స్ : పవిత్రమైనదా, అపవిత్రమైనదా?
మనిషి లైంగికత పవిత్రమైనదా, అపవిత్రమైనదా? అక్కడ తప్పు ఒప్పు అంటూ ఏమీ లేవు, అంటారు సద్గురు. అది మన భౌతిక ఉనికికి ఒక అవసరమైన భాగం. కానీ దాని భూమిక మాత్రం పరిమితమైనది. సద్గురు మనలోని లైంగిక భావోద్రేకాలను గుర్తించటం ముఖ్యం అంటారు, అదే సమయంలో దానిని బాధ్యతాయుతంగా నిర్వహించుకోవాలి అంటారు.
మనం ముందు మొదటి మాట “నీతి హీనమైనది” గురించి చూద్దాము. ఆ మాట అన్నప్పుడు చాలామంది చాలా వరకు దాని వైపు మొగ్గు తిన్నారు. ఈ సెక్స్ అనేది చాలా ప్రాథమికమైన అవసరమే, అయినా చాలామందికి ఇది జీవితాంతం ఉండే ఆకాంక్ష అయిపోయింది. మనం దీనిని అర్థం చేసుకుందాము. సెక్స్ అనేది మనలోని చాలా ప్రాథమికమైన కోర్కె. అది యవ్వనంలో జరిగే ఒక రసాయనిక మార్పు. అది సౌఖ్యం ఇచ్చే అనుభూతి, ఎందుకంటే ప్రకృతి దీనిద్వారా మనని పునరుత్పత్తి వైపుకు తోస్తుంది. కానీ కాలం గడిచే కొద్దీ మనం ఇందులో పునరుత్పత్తిని ఒక ఎన్నికగా ఉంచి, సుఖం అంశాన్ని మాత్రం అలాగే ఉంచేశాము. దీని గురించి కూడా తప్పు ఏమీ లేదు. వ్యక్తి భౌతికతలో లైంగికతని ఒక ముఖ్యమైన అంశంగా గుర్తించటం అవసరం. ఇద్దరు వ్యక్తులు తమలో శృంగారం కోరుకున్నారు కాబట్టే మనం ఉన్నాము, ఇది యదార్ధం.
అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే మతాలు, నీతి బోధలు అనేవారు మన శరీర ధర్మాలు గర్హనీయమన్నారు. అందువల్ల తరతరాలుగా అది ఎంతో బాధను, న్యూనతను తెచ్చింది. మీరు ఎప్పుడైతే ఒక విషయాన్ని కాదంటారో, అది మన మనసులో ఎంతో ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ అణగతొక్కే విధానం మనిషి మనసుకు ఎంతో బాధను తెచ్చిపెట్టింది.
అదే సమయంలో మనం ఈ కెమిస్ట్రీ చేతిలో కీలుబొమ్మలమా? ఖచ్చితంగా కాదు. మానవ జీవితంలో సెక్స్ కు ఒక పాత్ర ఉండటం పరవాలేదు, కానీ అది మితమైనది. మీరు మీ మనసు మీద శ్రద్ధ పెట్టిన కొద్ది దాని ప్రభావం తగ్గుతుంది. ఒకసారి ఈ సౌఖ్యాలు మనసు కన్నా లోతైనవి గా అనిపిస్తే లైంగికత యొక్క ప్రాముఖ్యత తగ్గుతుంది.
లైంగికతకు దాని స్థానం అందుకోనివ్వడం
ఈ మధ్యకాలంలో ప్రాశ్చాత్య దేశాల్లో లైంగికత పట్ల కొన్ని మతఛాందసులు చూపుతున్న వ్యతిరేకతకు ఎక్కువగా ప్రతిస్పందించిన ఈ సమాజం తమను తాము శరీరంతో గుర్తించుకోవడం ఎక్కువయింది. దానిని మనం గుడ్డిగా అనుసరించడం దురదృష్టకరం అవుతుంది. మన ప్రాథమిక జీవశాస్త్రాన్ని కాదనకూడదు. అదే సమయంలో దానినే గొప్పగా కూడా చేసుకోకూడదు. మీరు మీ చిన్నతనం నుంచి యవ్వనం వరకు అభివృద్ది చెందినప్పుడు గమనిస్తే, అది మిమ్మల్ని ఆశ్చర్యపరిచాలి, అంతేగాని మిమ్మల్ని శాసించకూడదు. సహజంగా వచ్చే మన వివేకం, ఈ హార్మోన్ ఆట కన్నా ఎక్కువే అని మనకు తెలియపరచాలి. జంతువుల లాగా మానవులు హార్మోనుల చేతిలో కీలుబొమ్మలా ఉండకూడదు. మనిషిలోని భావపూరితమైన, మానసికమైన సహచర్యం భౌతిక అవసరానికన్నా చాలా బలమైనది.
దురదృష్టవశాత్తు ఎవరైతే తమ వివేకాన్ని తమ హార్మోనుల నిర్దేశించడాన్ని అనుమతిస్తారో, వారు తమ సమతుల్యతను కోల్పోతారు. ఎంతో మంది యువత తమ వివేకాన్ని, తాము చదువుతున్న లేక ఆన్లైన్లో, సినిమాల్లో చూస్తున్న వాటి కన్నా హీనం చేయటం దురదృష్టకరం. దీని మూలంగా లైంగికతకు ప్రతిస్పందన ఎరుకతో, సమతుల్యతతో కాకుండా ఒక మూస విధానంలో వస్తున్నది. ప్రజలు లైంగికతకు అనుకూలంగాను వ్యతిరేకంగానో మాట్లాడుతూనే ఉన్నారు. అవి రెండూ అనవసరమే. మనం చేసుకోవలసింది శరీరానికి మనసుకు ఉండవలసిన ఒక రకమైన అంతర్గత సమతుల్యత తెచ్చుకోవడం. అందువల్ల ఈ లైంగికతకు తనదైన స్థానం లభిస్తుంది. లైంగిక ప్రేరణను గుర్తించడం ముఖ్యం, అదే సమయంలో దానిని బాధ్యతాయుతంగా ప్రవర్తించడం కూడా చాలా ముఖ్యం.
కొన్ని యోగ సాధనలను చిన్నతనం నుంచీ చేయడం మొదలెడితే అది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే, అది శరీరం, మనస్సులను క్రమబద్ధం చేస్తుంది. బోధనలకన్నా అది ఎంతో ప్రభావవంతమైనది.
సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి. UnplugWithSadhguru.org.